Take a fresh look at your lifestyle.

కుల్కచర్ల గిరిజన బాలుర వసతి గృహంలో విషాదం నిద్రలోనే హాస్టల్ విద్యార్థి మృతి..!

వికారాబాద్, ముద్ర ప్రతినిధి: వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలోని గిరిజన బాలుర వసతి గృహంలో విషాదం చోటు చేసుకుంది.గురువారం ఉదయం నేనావత్ దేవేందర్ (16) అనే పదవ తరగతి విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.రాత్రి పడుకున్న విద్యార్థి తెల్లవారినా నిద్ర లేవకపోవడంతో విద్యార్థి ఆచేతనంగా పడి ఉండడంతో పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.కొన్ని గంటల ముందే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.ఈ సమాచారం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు బంధువులు పరిగి ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకొని విద్యార్థి మృతదేహాన్ని చూసి తీవ్రంగా విలపించారు.వసతి గృహంలో ఏదో జరిగిందనివిద్యార్థి కుటుంబ సభ్యులు.అనుమానం వ్యక్తం చేశారు.కుల్కచర్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.