Take a fresh look at your lifestyle.

ప్రజా ప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు

  • అభివృద్ధి,సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
  • రాష్ట్ర ఎక్సైజ్,పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

ముద్ర,పానుగల్: ప్రజా ప్రభుత్వంలో అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం పానుగల్ మండల కేంద్రంలోని కదిరేపాడు, శాగాపూరు,మాదవరావుపల్లి,గోప్లాపూర్, బండపల్లి జమ్మాపూర్, కేతేపల్లి, బుసిరెడ్డిపల్లి, రాయినిపల్లి,మాంధాపూర్, చింతకుంట తదితర గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా వున్నప్పటికీ సంక్షేమ పథకాలను పార్టీలకతీతంగా అందించడం జరుగుతుందన్నారు.గత పదేళ్ళ పాలనలో బిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి తీసుకవెళ్ళిందన్నారు.ప్రజా రైతు సంక్షేమమే లక్ష్యంగా సిఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా ప్రభుత్వం పాలన కొనసాగిస్తున్నట్లు తెలిపారు.ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్లు,రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ పథకం,రేషన్ కార్డుల పంపిణీ తదితర పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.

ప్రజాపాలన, కులగణన సర్వేలో భాగంగా వచ్చిన దరఖాస్తులు,గ్రామ సభలలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన లబ్ధిదారులకు ఎంపిక చెయ్యడం జరుగుతుందన్నారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిజమైన లబ్దిదారులకే అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్ సాగర్,మాజీ ఎంపీపీ వెంకటేష్ నాయుడు, మాజీ జడ్పీటీసీ రవి కుమార్,మాజీ సింగిల్ విండో వైస్ చైర్మన్ భాస్కర్ యాదవ్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు పుల్లారావు,రాము యాదవ్,జయరాములు సాగర్,బ్రహ్మం,అధికారులు,మాజీ ప్రజాప్రతినిధులు,ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.