Take a fresh look at your lifestyle.

బాలల సంరక్షణ చర్యలపై సమీక్షిస్తున్న కలెక్టర్ శ్రీ హర్ష

  • బాలల సంరక్షణ చర్యలపై సమీక్ష
  • బాలల సమస్యల ఫిర్యాదుకు 1098 కు ఫోన్ చేయాలి

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: బాలల సమస్యలపై ఫిర్యాదులు అందించేందుకు 1098 ఫోన్ నెంబర్ కు ఫోన్ చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.గురువారం కలెక్టరేట్ లో బాలల సంరక్షణ చర్యలపై సంబంధిత మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.జిల్లాలో ఉన్న అనాథ పిల్లలు, సెమీ ఆర్ఫన్ పిల్లలో స్పాన్సర్షిప్ కు అర్హులైన పిల్లలను గుర్తించి వారి వివరాలు సేకరించాలని ఆదేశించారు.జిల్లాలో ఎక్కడ బాల్య వివాహాలు జరగకుండా సంబంధిత అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు.జిల్లాలో ఎక్కడ చట్ట వ్యతిరేక దత్తతలు జరగకుండా సంబంధిత ఆసుపత్రి సూపరింటెండెంట్ లతో సమన్వయం చేసుకోవాలని,గ్రామీణ బాలల పరిరక్షణ కమిటీలకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు.బాలలపై జరిగే లైంగిక దాడులను నివారించేందుకు సంబంధిత వ్యవస్థలతో సమన్వయం చేసుకుని పనిచేయాలని ఆదేశించారు.బాల కార్మికులు లేని జిల్లాగా పెద్దపల్లిని తీర్చిదిద్దాలని ఇటుక బట్టీలలో పని చేసే పిల్లలు గుర్తించి వారికి విద్య అదేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు.పిల్లల ద్వారా జరిగే భిక్షాటన వివరాలు,బాల్య వివాహాలు, బాల కార్మికులు ఎక్కడైనా కనబడితే 1098 కు ఫోన్ చేసి వివరాలు అందించాలని అన్నారు. అనాధ పిల్లలను బాల సదనంలో చేర్పించవచ్చని తెలిపారు.జిల్లా బాలల పరిరక్షణ అధికారి కమలాకర్, చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ ఉమాదేవి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.