Take a fresh look at your lifestyle.

గ్రూప్ 2 ఫలితాలలో మెరిసిన కల్వరాల యువకులు

ముద్ర,వీపనగండ్ల: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన గ్రూప్ 2 ఫలితాలో మండల పరిధిలోని కల్వరాల గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు రాష్ట్రస్థాయిలో ర్యాంక్ లు సాధించి గ్రామానికి వన్నెతెచ్చారు.కల్వరాల గ్రామానికి చెందిన జనుంపల్లి సత్య శిలారెడ్డి కుమారుడు అజయ్ కుమార్ రెడ్డి రాష్ట్రస్థాయిలో 17 ర్యాంకు, గద్వాల జోగులాంబ జోన్ లో మొదటి ర్యాంకు సాధించారు.అజయ్ కుమార్ రెడ్డి ఇంతకుముందే 2018లో హైదరాబాదులోని ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కేంద్ర కార్యాలయంలో అసోసియేట్,2019 ఆగస్టులో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ గా, తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లో అకౌంట్ గా, 2019లో జరిగిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సిజిఎల్ ఎగ్జామ్ లో ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్లో టాక్స్ అసిస్టెంట్ జాబుకు అర్హత సాధించారు.ప్రస్తుతం అజయ్ కుమార్ రెడ్డి చిన్నంబాయి తాసిల్దార్ కార్యాలయంలో అసిస్టెంట్ స్టాటికల్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నారు.ఉద్యోగ విధులు నిర్వహిస్తూనే ఆన్లైన్లో కోచింగ్ వీడియోలు చూస్తూ గ్రూప్2 కు సన్నదమై విజయం సాధించారు. ఇదే గ్రామానికి చెందిన చటమోని శ్రీనివాసులు యాదవ్ కుమారుడు చటమోని భరత్ యాదవ్ రాష్ట్రస్థాయిలో 75 ర్యాంకు సాధించగా,ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తున్నరు.ఒకే గ్రామం నుంచి ఇద్దరు యువకులు గ్రూప్ 2 ఫలితాలలో రాష్ట్ర స్తాయి లో ర్యాంకులు సాధించటం పట్ల తల్లిదండ్రులు, ఉద్యోగస్తులు గ్రామస్తులు మండల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.