Take a fresh look at your lifestyle.

కూకట్‌పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన భవనం ప్రారంభం

 
ముద్ర కూకట్‌పల్లి:

స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన అదనపు భవనాన్ని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు బండి రమేష్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్య ద్వారానే జీవితాల్లో వెలుగులు నిండుతాయని, విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కళాశాల అభివృద్ధికి అవసరమైన మరిన్ని నిధులు, అదనపు గదుల నిర్మాణానికి స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, అంగన్‌వాడీ టీచర్లకు స్మార్ట్‌ఫోన్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.