ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
వికారాబాద్ మున్సిపల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య. ఈ సందర్భంగా మహిళలకు గేమ్స్ నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేసి అనంతరం కేక్ కట్ చేసిన చైర్ పర్సన్. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ తన తోటి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు మరి ఇంకెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ వైస్ చైర్మన్ అర్థ సుధాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, మహిళలు తదితరులు పాల్గొన్నారు.