Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి:  ప్రభుత్వం అందిస్తున్న పథకాలను విద్యార్థులు చక్కగా ఉపయోగించుకోవాలి-సర్పంచ్ చింతకుంట్ల మనోజ్ మనోజ్

 

ప్రజా దీవెన…. తుంగతుర్తి:

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను తల్లిదండ్రులు విధిగా చేర్పించాలని రావులపల్లి సర్పంచ్ చింతకుంట్ల మనోజ్ అన్నారు. శనివారం మండల పరిధిలోని రావులపల్లి గ్రామంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి ర్యాలీ గ్రామంలో నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉంటారన్నారు. ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, యూనిఫాం లను ప్రభుత్వం అందిస్తోందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.