Take a fresh look at your lifestyle.

మరో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దే అధికారం-* సిద్ధిపేట నియోజకవర్గం ఇన్చార్జ్ పూజల హరికృష్ణ, పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్

 

ముద్ర ప్రతినిధి,సిద్ధిపేట:

మరో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం లో ఉంటుందని అన్ని వర్గాలను అభివృద్ధి చేసుకుందాం అని సిద్ధిపేట నియోజకవర్గం ఇన్చార్జ్ పూజల హరికృష్ణ, పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. సిద్ధిపేటలో కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయం లో 11 వార్డుకు చెందిన బీఆర్ ఎస్ పార్టీ చెందిన నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువాలు కప్పిపార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 10 సంవత్సరాలు ప్రజలు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని కెసిఆర్ నాశనం చేశారు అని అన్నారు. ధనిక రాష్ట్రం గా ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేశారని లక్షల కోట్లు రూపాయలు కెసిఆర్ కుటుంబం దోచుకున్నారు అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినక కెసిఆర్ కుటుంబం చేసిన అప్పులకు వడ్డీ చెల్లిస్తూ రాష్ట్రం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను కెసిఆర్ మోసం చేశారు అని అందుకే ఫామ్ హౌజ్ కే కెసిఆర్ ను ప్రజలు పరిమితం చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూసేసిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో బొమ్మల యాదగిరి ముద్దమ లక్ష్మీ రషద్ వహాబ్ గయాస్ హర్ష 3విజయ్ డానియల్ తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.