ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
……………………………………..
సమాజ నిర్మాణం లో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకం అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం
మహబూబ్‌నగర్లోని బీఈడ్ కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైనదని, భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే గొప్ప బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుందన్నారు. విద్యార్థులు చదువులో నిబద్ధతతో ముందుకు సాగాలన్నారు. తన హయాంలో బీఈడీ కళాశాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కళాశాలకు కొత్త భవన నిర్మాణంతో పాటు అధునాతన సదుపాయాలతో కూడిన సరికొత్త లైబ్రరీని అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులు మెరుగైన విద్యను పొందేందుకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు.ఉమ్మడి రాష్ట్రం లో ఈ కళాశాల నుంచి ఎంతో మంది ఉపాధ్యాయులు తయారై రాష్ట్ర వ్యాప్తంగా సేవలందిస్తున్నారని, ఈ కళాశాలకు గొప్ప చరిత్ర ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ నేటి విద్యార్థులు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎదిగి సమాజానికి సేవ చేయాలని ఆయన ఆకాంక్షించారు. త్వరలో డిఎస్సీ జరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, కార్పొరేటర్ ఎస్.శేఖర్, నాయకులు రఘు , కళాశాల పర్యవేక్షకులు కె.రామకృష్ణరావు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.