Take a fresh look at your lifestyle.

ఐదు లక్షల ఎల్ఓసి అందజేత 

రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న ఎనగందుల స్వాతికి ఐదు లక్షల రూపాయల ఎల్ఓసి (లెటర్ ఆఫ్ క్రెడిట్) ను చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ మంజూరు చేశారు. క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎన్టీఆర్ నగర్ కు చెందిన స్వాతి నివాసంలో మంచిర్యాల జిల్లా అధికార ప్రతినిధి వోడ్నాల శ్రీనివాస్ సంబంధిత ఎల్ఓసి పత్రాన్ని బుధవారం అందించారు.జిల్లా కార్యదర్శి మొట్టే సుధాకర్, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు గుర్రం అనిల్ కుమార్,చంద్రయ్య,తిరుపతి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.