Take a fresh look at your lifestyle.

ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ

  • ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న పేదవారి సొంతింటి కల నెరవేరిన వేళ.
  • ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీతో ఆనందం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు.
  • కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు.

 ముద్ర విలేకరి,కోరుట్ల: కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం రోజు పట్టణానికి చెందిన 33 వార్డుల కు గాను కోరుట్ల పట్టణంలోని జిఎస్ గార్డెన్లో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు విచ్చేసారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ఇందిరమ్మ కమిటీ సభ్యులతో కలిసి పట్టణానికి చెందిన 33 వార్డుల్లో అర్హులైన 502 మంది లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ తో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు.కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ అని, ప్రజా అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేద ప్రజల సొంతింటి కల సహకారం చేయడం కోసం ఇందిరమ్మ ఇండ్ల కమిటీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉండి కనీసం అర్హులైన లబ్ధిదారులకు ఇండ్లు పంపిణీ చేయకుండా కేవలం తమ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మాత్రమే పంపిణీ చేసిందన్నారు.కోరుట్ల పట్టణంలో కేవలం 80 ఇల్లు మాత్రమే మంజూరు చేయగా అది కూడా తమ నాయకులకు కార్యకర్తలకు కట్టబెట్టారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 18 నెలల వ్యవధిలోనే జనాభా ప్రాతిపదికన అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేయడం జరిగిందన్నారు. గతంలో ఇందిరమ్మ ఇంటికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాజీ మంత్రివర్యులు స్వర్గీయ రత్నాకర్ రావు హయాంలో కోరుట్ల పట్టణంలో సుమారు 5000 ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని, కానీ గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కేవలం 80 మాత్రమే మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావు తోపాటు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు, ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు వార్డు ఆఫీసర్లు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.