Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా విజయవంతం*

 

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:

నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో డైరీ సైన్స్, లైఫ్ సైన్స్ విద్యార్థుల కోసం నిర్వహించిన జాబ్ మేళా విజయవంతంగా నిర్వహించబడినట్లు కళాశాల ప్రిన్సిపాల్ మదన్మోహన్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాబ్ మేళాలో సుమారు 80 మంది అభ్యర్థులు పాల్గొన్నారని తెలిపారు. సిరవిన్ బయాలజికల్ లిమిటెడ్ లైబిలిటీ పార్ట్నర్షిప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాబ్ డ్రైవ్‌లో శంషాబాద్ ప్రాంతానికి చెందిన పలు కంపెనీలు పాల్గొన్నట్లు పేర్కొన్నారు.

అనిమల్ ఫార్మ్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ ఆఫీసర్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించగా 20 మందికి పైగా అభ్యర్థులు ఎంపికైనట్లు తెలిపారు. ఎంపికైన వారిలో డైరీ సైన్స్ మరియు లైఫ్ సైన్స్ విద్యార్థులు ఉన్నారు.

ఈ కార్యక్రమంలో లైఫ్ సైన్స్ అధ్యాపకులు కోదండరాములు, డైరీ సైన్స్ అధ్యాపకుడు దశరథం యాదవ్, అలాగే అధ్యాపకులు అంజయ్య, వనిత, ఉమాదేవి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.