Take a fresh look at your lifestyle.

దేవినగర్ పోచమ్మ దేవాలయంలో.. ఘనంగా శాకంబరి ఉత్సవాలు

కుషాయిగూడ , ముద్ర విలేఖరి: ఏఎస్ రావు నగర్ డివిజన్ దేవినగర్ లోని పోచమ్మ దేవాలయంలో శాకాంబరి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మంగళవారం కూరగాయలు పండ్లతో అమ్మవారిని శాకంబరీ రూపంలో అలంకరించి భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ఇక శాకంబరీ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించేందుకు భక్తులు ఆలయానికి రావడంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.ఈ పూజా మహోత్సవంలో స్థానిక బిజెపి నాయకురాలు శివకామేశ్వరి, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.