Take a fresh look at your lifestyle.

నీటి శుద్ధి యంత్రం ప్రారంభం

రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 1990/91 పదో తరగతి పూర్వ విద్యార్థులు ముప్పై వేల రూపాయల విలువ చేసే ఆర్వో నీటి శుద్ధి యంత్రాన్ని విద్యార్థుల సౌకర్యార్థం బుధవారం అందజేశారు.పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, మండల విద్యాధికారి దత్తు మూర్తి పాల్గొని నీటి శుద్ధి యంత్రాన్ని ప్రారంభించారు. ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ కోమల, పూర్వ విద్యార్థుల కమిటీ కన్వీనర్ లక్ష్మణ్ మూర్తి, కో-కన్వీనర్లు శ్రీనివాస్, సారంగరావు, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.