Take a fresh look at your lifestyle.

రోడ్ల పై పెండింగ్ పనులు పూర్తి చేయాలి రోడ్డు ప్రమాదాలను నివారించాలి మత్తు పదార్థాలపై నిఘా పెంచాలి కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్:
రోడ్లపై పెండింగ్ పనులు పూర్తి చేసి రోడ్డు ప్రమాదాలు లేకుండా చూడాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో రోడ్ సేఫ్టీ, మత్తు పదార్థాల నిర్మూలనపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ రోడ్డుపై ప్రయాణించే ప్రతి ఒక్క వాహనదారుడు సకాలంలో క్షేమంగా ఇంటికి చేరాలన్నారు.
రోడ్లపై పెండింగ్లో ఉన్న సిసి కెమెరాలు, సిగ్నల్స్, విద్యుత్ దీపాలు, సైన్ బోర్డులు, గుంతలు పూడ్చి పెండింగ్ పనులు లేకుండా చూడాలన్నారు.విద్యా సంస్థల్లో, కళాశాలలో రోడ్డు భద్రత నియమాల గూర్చి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా ద్విచక్ర వాహనదారులకు జరుగుతున్నందున వాహన దారులు నియమాలు పాటించడం, హెల్మెట్ ధరించడం, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండడం, రోడ్లపై ఉన్న వివిధ సిగ్నల్, మార్కింగ్ గురించి తెలుసుకొని జాగ్రత్తగా ప్రయాణం చేయాలని సూచించారు.
మత్తు పదార్థాలపై నిఘా పెంచాలన్నారు. మత్తుకు అలవాటు పడి యువకులు భవిష్యత్తు కోల్పోకుండా చూడాలన్నారు.
ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రమాదాలు నివారించవచ్చని, విద్యాలయాల్లో, మెడికల్ షాపుల్లో, పరిశ్రమలలో నిరతరం మత్తు పదార్థాలపై నిఘా పెట్టామన్నారు. మత్తుతో జీవితాలు చిత్తు అయిపోతాయన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, డీఎంహెచ్ఓ డా.శ్రీరామ్, డిఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.