Take a fresh look at your lifestyle.

దుస్థితి చూస్తే దుఃఖమొస్తున్నది

  • పదేండ్లలో తెలంగాణను దగదగలాడించాం
  • జేసీబీలు పెట్టి చెరువుల్లో పూడిక తీసింది మనం
  • హైడ్రా అని.. ఏదో బొంద అని పెట్టి పేదల ఇండ్లు కూలగొడుతున్నారు
  • కేసీఆర్​ మంచిగ ఇచ్చిన కరెంట్ ను కాంగ్రెస్​ ఎందుకిస్తలేదు
  • అత్యవసరం అయితే ప్రజలకు అవసరం లేని ప్రభుత్వ భూములు అమ్మవచ్చు
  • తెలంగాణకు అప్పటి నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్  నెంబర్ వన విలన్
  • స్వరాష్ట్రంలో ఎన్నో పథకాలు తెచ్చుకున్నాం
  • రాజశేఖరరెడ్డి పెట్టిన ఆరోగ్య శ్రీని కొనసాగించాం
  • మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరుపాలి
  • రజతోత్సవ సభలో బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​
  • మేం పడగొట్టం…ప్రజలే వీపులు పగలగొడుతారు
  • ప్రసంగంలో ఎక్కడా రేవంత్​ రెడ్డి పేరెత్తని గులాబీ బాస్​
ముద్ర, తెలంగాణ బ్యూరో: కొట్లాది సాధించుకున్న తెలంగాణనుబీఆర్ఎస్ పదేళ్ల పాలనలో  రాష్ట్రాన్ని ద‌గ‌ద‌గ‌లాడే విధంగా, అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయేలా  నిర్మించుకున్నామ‌ని బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అటువంటి రాష్ట్రంలో  ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే తనకు దుఃఖం వస్తోందన్నారు. నా కళ్ల ముందే తెలంగాణ ఆగమైతుంటే..మనస్సు కకావికలం అవుతోందన్నారు.కాంగ్రెస్ పాలనలో ప్రజలు పడుతున్న బాధలు చూస్తుంటే కడుపు తరుక్కపోతున్నదన్నారు.తెలంగాణ ఆర్థిక ప‌రిస్థితి దెబ్బ‌తిన‌డం, అన్న‌దాత‌ల‌ను ఇబ్బంది పెట్ట‌డం చూస్తుంటే.. నాకు బాధేస్తుంద‌న్నారు.దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన తెలంగాణ  రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలకులు కుక్కలు చింపిన విస్తరిలా మార్చుతున్నారని  ధ్వజమెత్తారు.రాష్ట్రంలో ఏ రంగం అభివృద్ధి చెందడం లేగని మండిపడ్డారు. అధికారం కోసం ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాటలను విశ్వసించి  అధికారాన్ని కట్టబెట్టిన పాపానికి రాష్ట్రాన్ని పూర్తిగా  అస్థిరపరుస్తున్నారని  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేారు. తెలంగాణకు అప్పటి నుంచి ఇప్పటి దాకా కాంగ్రెస్ నెంబర్ వన్ విలన్  అని కేసీఆర్  విరుచుకుపడ్డారు.  పాలన అంటే దోచుకోవడం..దాచుకోవడం అన్న చందంగా కాంగెస్ ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. గోల్‌మాల్ చేయడంలో కాంగ్రెస్ పార్టీని మించిన పార్టీ లేదన్నారు. ఢిల్లీ నుండి డూప్లికేట్ గాంధీలు కూడా వచ్చి లేనిపోని హామీలు ఇచ్చి  ప్రజల గొంతు కోశారని విమర్శించారు. ఇలాంటి అసమర్ధ  కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తాము పడగొట్టమని.. సక్కగా పని చేయక పోతే ప్రజలే వారి వీపులు సాపు చేస్తారని హెచ్చరించారు.ఆదివారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో నిర్వహించిన పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై తనదైన శైలిలో విరుచుకపడ్డారు. అక్కడా ఆయన సీఎం రేవంత్ రెడ్డి పేరు ఉచ్చరించకుండానే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కడిగిపారేశారు.ముందుగా పహల్గాం ఉగ్ర దాడిలో చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరేలా ఒక నిమిషం పాటు మౌనం పాటించారు.అనంతరం శ్రీరాముడు చెప్పిన “జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ” మాటలను స్పూర్తిగా తీసుకోని తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టానని అన్నారు.అప్పటికే తెలంగాణలో చాలా గంద‌ర‌గోళ ప‌రిస్థితిలు నెలకొని ఉన్నాయన్నారు.దిక్కుతోచని స్థితిలో..ఆత్మ‌హ‌త్య‌ల‌కు అల‌వాల‌మైన, వ‌ల‌స‌ల‌కు నిల‌య‌మైన‌టువంటి, వ‌ల‌స‌వాదుల విష‌కౌగిలిలో న‌లిగిపోతున్న‌టువంటి తెలంగాణను ఎట్టి ప‌రిస్థితుల్లో విముక్తి చేయాల‌ని స్వ‌రాష్ట్రం సాధించాల‌న్న పట్టుదలతో ముందడుగు వేశానని అన్నారు. నేను ఒక్క‌డిగా బ‌య‌ల్దేరి తెలంగాణ ఉద్య‌మానికి శ్రీకారం చుట్టానని అన్నారు. ఉద్యమం కోసం బయలు దేరి నాడు తనను ఎన్నో మాట‌లు అన్నారన్నారు. ఎగ‌తాళి, అవ‌హేళ‌న చేశారు. మఖ‌లో పుట్టింది పుబ్బ‌లో పోత‌ద‌ని అన్నారు. కానీ అనేక మంది త్యాగాల‌తోని, వంద‌లాది మంది బ‌లిదానాల‌తోని, అనేక ఉద్య‌మాల‌తోని యావ‌త్ తెలంగాణ అద్భుత‌మైన ఉద్య‌మమై ఎగిసిప‌డిందన్నారు. ఒక స‌మ‌యంలో తెలంగాణ యావ‌త్ ఒక ప‌క్క‌న నిల్చుని బ‌రిగీసి నా తెలంగాణ అక్క‌డ పెట్టు అని నిల‌బ‌డ్డ‌ సంద‌ర్భం సృష్టించామన్నారు. తెలంగాణ‌ రాష్ట్రాన్ని సాధించుకున్నాం అని కేసీఆర్ గుర్తు చేశారు.
  • కడుపులో పెట్టుకుని చూసుకున్నా
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలను, రాష్ట్రాన్ని కడుపులో  పెట్టుకుని చూసుకున్నానని కేసీఆర్ అన్నారు. దేశంలోనే అనేక వినూత్నమైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. వ్యవసాయరంగాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా నిలిపామన్నారు.రైతుల కోసం తీసుకొచ్చిన రైతు బంధు పథకం దేశానికే రోల్ మోడల్ గా నిలిపామన్నారు.అలాగే రైతాంగానికి ఉచిత కరెంట్ ఇచ్చామన్నారు తెలంగాణ వస్తే కారు చీకటే అన్నోళ్ల నోళ్లు మూయించేలాగా నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇచ్చామన్నారు.రైతులు చనిపోతే రైతు భీమా అందించామన్నారు.కడుపులు సల్ల కదలకుండా రైతు బంధు పథకాన్ని అమలు చేసుకున్నామన్నారు..వందలకోట్ల రూపాయల నష్టం వచ్చిన ధాన్యం కొనుగోలు చేశామన్నారు.వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు వేశామన్నారు. రూ. 40 కోట్ల ఐటీని 2 లక్షల ఆదాయానికి పెంచామన్నారు. బీఆర్ఎస్ టైమ్ లో మత కల్లోలం లేదు. ప్రతి ఒక్కరిని కడుపులో పెట్టుకుని చూసుకున్నామన్నారు. అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించుకున్నామన్నారు.మూడేళ్లలో కాళ్లేశ్వరం కట్టామన్నారు.పంజా తలదన్నేలా పంటలు పండించామన్నారు. దళితబంధు, రైతుబంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతుబీమా వంటి అనేక చారిత్రాత్మక పథకాలు తీసుకొచ్చి అన్ని వర్గాల ప్రజల రూపురేఖలు మార్చుకున్నామన్నారు.బీఆర్ఎస్ హ‌యాంలో భూముల ధ‌ర‌లు ఎలా ఉండే..? ఆనాడు కొనేటోళ్లు ఎక్కువ ఉండిరి.. అమ్మేటోల్లు త‌క్కువ ఉండిరి. ఇవాళ ఆప‌తికి అమ్ముదామంటే కొనేటోడు లేడు. భూముల ధ‌ర‌లు ఎక్క‌డికి పోయాయి. రైతులు కోటీశ్వ‌రుల‌మ‌నే ధైర్యంతో ఉండే. ఒక్క ఏడాదిలోనే ఇంత గ‌ల్లంతు అయిత‌దా..? కేసీఆర్ ప‌క్క‌కు పోగానే ఇంత ఆగ‌మైత‌దా.. అని కేసీఆర్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.కాగా హెచ్ సియూ భూముల వివాదంపై మొదటిసారిగా స్పందించిన కేసీఆర్.. అత్యవసరం అయితే, ప్రభుత్వం భూములు అమ్మొచ్చు.ప్రజలకు అవసరం లేని భూములు అమ్మొచ్చునని అన్నారు.  కానీ గత ప్రభుత్వాలు చేసిన మంచి పనులను కూడా కొనసాగించాలన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి హయంలో ప్రవేశపెట్టిన “ఆరోగ్య శ్రీ” ని తాము మార్చలేదన్నారు.ఈ పథకం పేదలకు అండగా ఉండడంతో తాము అలాగే కొనసాగించామన్నారు.స‌మైక్య రాష్ట్రంలో క‌రెంట్ బాధ‌లు ప‌డ్డాం.తాను సీఎం అయ్యాక ఏడాదిన్న‌ర‌లో చ‌క్క‌గా చేసి 24 గంట‌ల క‌రెంట్ ఇచ్చామన్నారు.రెప్ప‌పాటు కూడా క‌రెంట్ పోలేదన్నారు.కేసీఆర్ ఇచ్చిన క‌రెంట్ మీకు ఎందుకు ఇవ్వ‌డం చేత కావ‌డం లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.మ‌ళ్లీ ప్ర‌జ‌ల గోస ఎందుకు పుచ్చుకుంటున్నారు..ఏం దౌర్భాగ్యం ఇది..ఎటువంటి శ‌ని మ‌నం నెత్తి మీద పెట్టుకున్నామన్నారుయ.మిష‌న్ భ‌గీర‌థ‌పై అసెంబ్లీలో నిల‌బ‌డి నేను ఛాలెంజ్ చేశాను. ఐదేండ్ల‌లో ప్ర‌తి ఇంట్లో న‌ల్లా పెట్టి నీళ్లు ఇవ్వ‌క‌పోతే మ‌ళ్లీ ఎల‌క్ష‌న్ల‌లో నిల‌బ‌డం.. ఓట్లు అడ‌గ‌డం అని చెప్పినం. ఇది ద‌మ్మున్నోడే చెప్పాలి. చేసి చూపించామన్నారు. కృష్ణా, గోదావ‌రి నీళ్లు మీ ఇంటి ముంద‌ర దుంకించినం.. ఇప్పుడు మంచినీళ్లు కూడా ఇవ్వ‌డం చేత‌నైత లేదని  ధ్వజమెత్తారు.క‌రెంట్ పోత‌ది.. మంచినీళ్లు రావు..వ‌డ్లు కొనే దిక్కు లేదు,ద‌ళారీ, దోపిడీ వ్య‌వ‌స్థ‌కు రైతాంగం గుర‌వుతుంది. 2104కు ముందు ప‌రిస్థితిలు వ‌స్తున్నాయి.. ఇది కాంగ్రెస్ ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ‌త కాదా..? అని కేసీఆర్ ప్ర‌శ్నించారు.
  • ఏం మాయరోగమొచ్చే.
కాంగ్రెస్ వచ్చి యేడాదిన్నర అయింది.మరి ఏం రోగమొచ్చే, ఏ గత్తరొచ్చిందని  కేసీఆర్ తనదై శైలిలో సెటైర్లు వేసి ప్రశ్నించారు. రైతు బంధు కేసీఆర్ పదివేలు ఇస్తుంటే..మేం రూ. 15 వేలు ఇస్తామ‌ని కాంగ్రెసొళ్లు గొప్పులు చెప్పిండ్రు..మరి ఇచ్చారా అని ప్రశ్నించారు. అలాగే తాము పెన్ష‌న్లు 2 వేలు ఇస్తుండు.. మేం  రూ4 వేలు ఇస్తామ‌ని చెప్పిండ్రు. ఇంట్లో ఇద్ద‌రు ఉంటే కేసీఆర్ ఒక్క‌రికే ఇస్తుండు..మేం ముస‌లిది ముస‌లోడికి ఇద్ద‌రం ఇస్త‌మ‌ని చెప్పిండ్రు..క‌దా..మరి ఇచ్చారా అని నిలదీశారు.దివ్యాంగుల‌కు కేసీఆర్ రూ.4 వేలు ఇస్తుండు..మేం రూ.6 వేలు ఇస్త‌మండ్రు. ఆడ‌పిల్ల‌ల‌కు స్కూటీలు కొనిస్తామ‌న్నారు. విద్యార్థుల‌కు విద్యాకార్డు కింద‌ ఐదు ల‌క్ష్య‌ల గ్యారెంటీ కార్డు ఇస్తామ‌ని ఎన్నో మాట‌లు చెప్పిండ్రు.ఇక ఒక‌రి వెనుక ఒక‌రు ఉరిచి..2 ల‌క్ష‌ల లోన్ తెచ్చుకోండి..డిసెంబ‌ర్ 9న ఒక కలంపోటుతో ఖ‌తం చేస్తా అని అన్నారు.చేసిండ్రా అంటే చేయ‌లేదు అని కేసీఆర్ విమ‌ర్శించారు.ఇలా కాంగ్రెసొళ్లు 420 హామీలు ఇచ్చారు..క‌ల్యాణ‌ల‌క్ష్మి కింద కేసీఆర్ ల‌క్షా నూట‌ప‌ద‌హార్లు ఇస్తున్నడు..మేం తులం బంగారం క‌లిపి ఇస్తామ‌ని చెప్పిండ్రు.ఎక్క‌డ‌న్న వ‌స్తుందా..? అని కేసీఆర్ ప్ర‌శ్నించారు.హామీలు ఇచ్చుడు కాదు..పెద్ద పెద్ద బుక్కులు ఊరురా పంచిండ్రు. సిగ్గు లేకుండా బాండ్ పేప‌ర్లు రాసిచ్చిండ్రు. అడ్డ‌గోలుగా హామీలు ఇచ్చిండ్రు..యేడికెళ్లి ఇస్తార‌ని కాంగ్రెస్ నేత‌ల‌ను అడిగితే..చేసి చూపిస్తాం.మాది పెద్ద పార్టీ.. మ‌మ్మ‌ల్ని మించిన సిపాయిలు లేర‌ని ఒక‌డు జ‌బ్బ‌లు చ‌రిచారు.ఒక‌డు మెడ‌లు చ‌రిచాడు.డైలాగులు మీద డైలాగులు కొట్టి ఇస్తామ‌న్నారు. ఇచ్చిండ్రా లేదు.,రుణ‌మాఫీ చేయ‌లేదు. మ‌ధ్య‌లో ఎంపీ ఎల‌క్ష‌న్లు వ‌చ్చాయి.నాకు కాళ్లు విరిగింది.. అయినా నేను బ‌య‌ల్దేరాను.. దీంతో తెలంగాణ‌లో ఎన్ని దేవుండ్లు ఉంటే అన్ని దేవుళ్ల మీద ఒట్టు పెట్టిండ్రు. ఇన్ని మాట‌లు చెప్పి మోసం చేశారు.ఉచిత బ‌స్సు అని పెడితే జుట్లు ప‌ట్టుకుని కొట్టుకునేందుకు ప‌నికి వ‌స్తుంది త‌ప్ప ఉప‌యోగం లేదు.ఈ ఉచిత బ‌స్సు మాకు అవ‌స‌రం లేదు అని ఆడ‌బిడ్డ‌లు అంటున్నారు.ఊ అంటే ఆ అంటే అబ‌ద్దాలు చెబుతున్నారు. మాట్లాడితే బీఆర్ఎస్, కేసీఆర్ మీద నింద వేస్తున్నారు. అడ్డ‌మైన మాట‌లు మాట్లాడుతూ ఘోరంగా మోసం చేస్తున్నారు అని కేసీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.ఈ నయకవంచక కాంగ్రెస్‌ ప్రభుత్వ అన్నిరంగాల్లో ఫెయిల్‌ అయ్యిందని విమర్శించారు. సంక్షేమంలో ఫెయిల్‌.మంచినీళ్లు ఇవ్వడంలో ఫెయిల్‌.సాగుకు నీరివ్వడంలో ఫెయిల్‌ అన్నారు.అలాగే కరెంటు సరఫరాలో ఫెయిల్‌.రైతుబంధు ఇవ్వడంలో ఫెయిల్‌. విత్తనాలు, ఎరువుల సరఫరాలో ఫెయిల్‌.ధాన్యం కొనుగోళ్లలో ఫెయిల్‌. పల్లెలు, పట్టణాల అభివృద్ధిలో ఫెయిల్‌.భూముల ధరలు పెంచడంలో ఫెయిల్‌.మరి దేంట్లో పాస్‌ అయ్యారు? ఎటుపడితే అటు ఒర్రుడు..దేవుండ్లపై ఒట్లుపెట్టుడు.. అబద్ధపు వాగ్ధానాలు చేసుడు.20-30శాతం కమీషన్లు తీసుకునుడు..సంచులు నింపుడు, సంచులు మోసుడు అంతేనా? ఈ మాట కరెక్టేనా? అన్నింట్లో ఈ ప్రభుత్వం ఫెయిల్‌ అయ్యిందా? అంటే..ఫెయిల్‌ అంటూ జనాలు నినదించారు.20-30శాతం కమీషన్ల మాట నేను అంటలేను. ఎవరు అన్నరు.స్వయంగా ఆర్థికశాఖ మంత్రి చాంబర్‌కు వెళ్లి 200 మంది కాంట్రాక్టర్లు పోయి లొల్లిపెట్టి.. మమ్మల్ని 20-30శాతం కమీషన్లు అడుగుతున్నారన్నారు.‘మాజీ సర్పంచులు పని చేశాం బిల్లులు ఇవ్వమంటే వాళ్లను గోసపుచ్చుకుంటున్నరు. వాళ్లేం పాపం చేశారు? అని ప్రశ్నించారు.
  • అసెంబ్లీకి దేనికి రావాలి…
కేసీఆర్‌  అసెంబ్లీకి రావాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారని..అయితే దేనికి రావాలి? మీ ముచ్చట్లు వినడానికా? పిల్లలు అడిగితే మీరు జవాబు చెప్తలేరని మండిపడ్డారు. ఉన్నది ఉన్నట్లు నిలబెడితే ఆ ఆర్థికమంత్రి అసెంబ్లీలో నిలబడి..భుజాలు తడుముకుంటున్నాడన్నారు.. సభలో పైగా అవివేకంతో, అజ్ఞానంతో అడ్డగోలు మాటలు చెప్రన్నారురు.దాంతో మనం కూడ గోల్‌మాల్‌ అయిపోయామన్నారు.తీర్థం పోదాం తిమ్మక్క అంటే..వాగు గుళ్లే..మనం సల్లే..ఇవాళ ప్రజలను ఆ గతికి తీసుకువచ్చారన్నారు. మరి ప్రజలు కూడా ఆలోచన చేయాలి.ఆవేశం కాదన్నారు.గాడిదలకు గడ్డేసి,బర్లకు పాలు పిండితే వస్తయా? మరి ఏం చేయాలో ఆలోచించాలన్నారు. ఓ తమ్ముడు అన్నడు హైదరాబాద్‌లో ఆయన ఇళ్లు కూలగొడితే.. కేసీఆర్‌ అన్న యాడున్నవ్‌ నువ్వు రావాలి.కత్తి వాడితో చేతిలో పెట్టి యుద్ధం నన్ను చేయమనవడితివి అంతేనా? దీన్ని కూడా ప్రజలు విచారించాలన్నారు.మీకు అర్థం కావాలనే ఇది చెబుతున్న.పోడగొట్టుకున్న కాడనే వెతుక్కోవాలి.మీ వెంట బీఆర్‌ఎస్‌ ఉంటది,కేసీఆర్‌ ఉంటడు, వందశాతం మళ్లీ తెలంగాణలో విజయం సాధించాలి.గులాబీ జెండా ఎగురవేయాలి.. అద్భుతమైన తెలంగాణను సాధించాలి’ అని పిలుపునిచ్చారు కేసీఆర్‌.
  • నన్ను రాళ్లతో కొట్టి చంపమని చెప్పా.
కన్నతల్లి, జన్మభూమిని మించిన స్వర్గం లేదని అన్నారు. వరంగల్ మామూలు నేల కాదు..ఎంతోమంది వీరుల్ని కన్న గడ్డ అని  కేసీఆర్ అన్నారు.ఈ గడ్డ మీద బీఆర్ఎస్ సభ పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఇదే రోజున గులాబీ జెండా ఎగిరిందని గుర్తుచేశారు.ఆ నాడు గులాబీ జెండాను ఎంతోమంది అవమానించారని చెప్పారు.కానీ ఎనాడూ నిరాశ చెందలేదని..నిర్విరామంగా పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించామని అన్నారు. ఉద్యమం జెండా ఎట్టి పరిస్థితుల్లో దించే ప్రసక్తే లేదని కార్యకర్తలను మాటిచ్చాను..జెండా దించితే నన్ను రాళ్లతో కొట్టాలని స్వయంగా చెప్పానని గుర్తుచేశారు.ఇచ్చిన మాట ప్రకారం ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చినా జెండా దించలేదని అన్నారు.చీకట్లను పారద్రోలి తెలంగాణలో వెలుగులు తీసుకొచ్చామని తెలిపారు.వలసవాదుల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించామని తెలిపారు. అధికారంలోకి వచ్చాక విధ్వంసమై తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించామని చెప్పారు.60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు ఎంతో గోసపడ్డారని తెలిపారు. ఆనాడైనా, ఈనాడైనా, ఏనాడైనా తెలంగాణకు శత్రువు కాంగ్రెస్ పార్టీనే అన్నారు.తెలంగాణ సాధించుకొస్తామని బయల్దేరిన ఉద్యమకారుల్ని ఇందిరా గాంధీ ప్రభుత్వం పిట్టల్లా కాల్చేసిందని తెలిపారు. మళ్లీ అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వమే రాష్ట్రంలో అధికారంలో ఉంది.. ప్రజలంతా గమనించాలని సూచించారు.
  • తెలంగాణ నినాదానికి జీవం పోశాం.
1969లో మూగ‌బోయిన తెలంగాణ నినాదానికి తిరిగి జోవం పోసింది ఈ గులాబీ జెండా అని కేసీఆర్ అన్నారు.పార్టీ కార్యాలయం కోసం కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ ఆశ్ర‌య‌మిస్తే,ఏప్రిల్ 27, 2001న జ‌ల‌దృశ్యంలో టీఆర్ఎస్ ఆవిర్భావం తెలంగాణ చ‌రిత్ర‌ను మలుపుతిప్పిన మ‌హోజ్వ‌ల‌ ఘ‌ట్టమన్నారు.కులం, మ‌తం, ప‌ద‌వుల కోసం పుట్ట‌లేదు,తెలంగాణ రాష్ట్ర సాధ‌న కోసం పుట్టింది టీఆర్ఎస్ పార్టీ అని అన్నారు.ప‌ద‌వీ త్యాగాల‌తోనే మ‌న తెలంగాణ ప్ర‌స్థానం ప్రారంభ‌మైందన్నారు.అది ఫ‌లించి సొంత రాష్ట్ర క‌ల కూడా నెర‌వేరిందన్నారు.
  • మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలి.
మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆపరేషన్ కగార్ వెంటనే ఆపాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ గడ్డ కర్రెగుట్టల్లో మారణం హోమం ఆపి, కేంద్రం నక్సలైట్లతో శాంతి చర్చలు జరపాలని సూచించారు.నక్సలైట్లను అనవసరంగా చంపొద్దు అన్నారు.అసలు మావోయిస్టులు ఏం చెప్పాలనుకుంటున్నారో ప్రభుత్వం వినాలన్నారు.అప్పుడే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు.
  • పార్టీ సోషల్ మీడియా  అద్భుతం.
బీఆర్ఎస్ సోషల్ మీడియా అద్భుతమని కేసీఆర్ అన్నారు.పార్టీ సోషల్ మీడియా వారియర్ బ్రహ్మాండంగా పని చేస్తున్నారు.ప్రజల కోసం కొట్లాడుతున్నాన్నారు.అలాంటి వారిపై కేసులు పెడుతున్న పోలీసుల పేర్లు డైరీల్లో రాసుకుంటున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం లోకి రావడం ఖాయమన్నారు.

Leave A Reply

Your email address will not be published.