ముద్ర, జోగుళాంబ గద్వాల ప్రతినిధి:
బాధితుల సమస్యల పట్ల బాధ్యతగా వ్యవహరించి వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు.
సోమవారం పోలీసు ముఖ్య కార్యాలయం నందు గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎస్పీకి, జిల్లా నలుమూలల నుండి సుదూర ప్రాంతాల వారు నేరుగా ఫిర్యాదులను సమర్పించి వారి సమస్యలను విన్నవించుకున్నారు. సమస్యలను తెలియజేసిన వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు ఇచ్చి ఫిర్యాదుల పట్ల వారి సమస్యల పట్ల వెంటనే సిబ్బందిని కేటాయించి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు.
ఈరోజు వచ్చిన పిర్యాదులలో పొలానికి సంబంధించి – 3, గొడవలకు సంబంధించి – 1, గర్ల్ మిస్సింగ్ సంబంధించి -1, అధిక వడ్డీలకు సంబంధించి – 1, ఇతర విషయాలకు సంబంధించి – 4,
మొత్తం 10 ఫిర్యాదులు అందాయి అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గద్వాల్ డి.ఎస్పీ. వై మొగిలయ్య, గద్వాల్ శాంతినగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు టి. శ్రీను, ప్రదీప్, టాటాబాబు తదితరులు పాల్గొన్నారు.