Take a fresh look at your lifestyle.

నేరాల నివారనే లక్ష్యంగా పని చేయండి

  • జిల్లా ఎస్పీ అశోక్ కుమార్.
  • గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలి.

కోరుట్ల/ఇబ్రహీంపట్నం, ముద్ర విలేకరి: వార్షిక తనిఖీ లో భాగంగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను శుక్రవారం జిల్లా ఎస్పి అశోక్ కుమార్ తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను, వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను పరిశీలించి కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్టేషన్ కు సంబంధించిన పలు రికార్డులను తనిఖీ చేశారు. సర్కిల్ కార్యాలయానికి సంబంధించిన సర్కిల్ ఇన్ఫర్మేషన్ బుక్, క్రైం రికార్డు , ప్రాపర్టీ రిజిస్టర్, పిటిషన్ రిజిస్టర్ లను పరిశీలించారు. గ్రేవ్ కేసులలో ఫోక్సో కేసులలో నిందితులకు శిక్షలు పడే విధంగా క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలని సూచించారు. ప్రజలకు సైబర్ నేరాలు, వివిధ సామాజిక అంశాలపై ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించాలని అన్నారు. అనంతరం సిబ్బందిని శాఖపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలతో సత్సంబంధాలను మెరుగుపరచుకుంటూ ప్రజలకు యువతకు ప్రత్యేకంగా సైబర్ నేరాల నివారణ పై చైతన్యాన్ని తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి రాములు, మెట్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్, ఇబ్రహీంపట్నం ఎస్.ఐ అనిల్, ఎస్.ఐ లు శ్రీకాంత్, రాజు, నవీన్, రాజు నాయక్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.