- కళాశ్రీ అధినేత గుండేటి రాజు.
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: సినారే సాహిత్యం విశ్వ విఖ్యాతి గాంచిందని, ఆయన సాహిత్యం అజరామరమని కళాశ్రీ ఈశ్వరమ్మ సాహిత్య పీఠం అధినేత గుండేటి రాజు కొనియాడారు. ఈరోజు గురువారం జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సినారే వర్ధంతి సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన సాహిత్యం పై కవి సమ్మేళనం చేశారు. ఈ కార్యక్రమంలో కవులు కవయిత్రులు అయిత అనిత, మద్దెల సరోజన, లక్కారాజు శ్రీ లక్ష్మీ, ములస్తం లావణ్య, ఓదెల గంగాధర్, డాక్టర్ శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు.