Take a fresh look at your lifestyle.

ఆదరించి అవకాశం ఇవ్వండి-తుమ్మల రాణి రవీందర్.

 

ముద్ర. పరకాల.

మొదటిసారిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనను ఆదరించి ఓ అవకాశం ఇవ్వాలని టిఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల రాణి రవీందర్ వార్డు ప్రజలను కోరారు. శుక్రవారం తన మద్దతు దారులతో కలిసి ఆరవ వార్డులో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. మహిళలు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి మహిళలకు బొట్టు పెట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రచారం చేశారు. తనపై నమ్మకంతో ఓటేసి గెలిపిస్తే వార్డును అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపెడతానని తుమ్మల రాణి రవీందర్ తెలిపారు. రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో నష్టపోయిన పరిస్థితులను ఓటర్లకు వివరిస్తూ ఆమె ప్రచారం చేశారు. పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరకాలను గత ప్రభుత్వ హయాంలో ఎంతో అభివృద్ధి చేశాడని అని తెలిపారు. ఆరవ వార్డులో అత్యధిక మద్దతుదారులు టిఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని దాంతో తన గెలుపు ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ దామెర మొగిలి చిరంజీవి తో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.