రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : పట్టణంలో బక్రీద్ పర్వదిన వేడుకలను శనివారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక ఒకటో వార్డు పరిధిలోని ఈద్గా వద్ద ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఒకరికొకరు అలయ్ బలయ్ చెప్పుకుంటూ బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.అబ్దుల్ అజీజ్,యాకూబ్ అలీ, అక్బర్ అలీ, సలీమ్, పాషా, ఖలీమ్ పాల్గొన్నారు. కాగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, పట్టణ ఎస్సై జీ.రాజశేఖర్, ఒకటో వార్డు మాజీ కౌన్సిలర్ పోగుల మల్లయ్య ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
