- పోస్ట్ ప్రోడక్షన్ లో “హే చికీతా” సినిమా.
- మే, లేదా జూన్ లో చిత్రం రిలీజ్ కు సన్నాహాలు.
- సినీ దర్శకులు ధన్ రాజ్ లెక్కల వెల్లడి.
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: సుందరకాండ మోషన్ పిక్చర్స్, అమరావతి మూవీ మేకర్స్ పథకం పై ధన్ రాజు లెక్కల దర్శకత్వంలో, గరుడ వేగా అంజి, అశోక్ ఆర్ఎన్ఎస్ నిర్మాణ సారథ్యంలో తెరకేక్కిన చిత్రం “హే చికీతా” అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుoటుందని సినీ దర్శకుడు ధన్ రాజ్ లెక్కల తెలిపారు.శనివారం దర్శకుడు ధన్ రాజ్ సినిమా గురించి విలేకరుల తో మాట్లాడుతూ వివరించారు.అభినవ్, దివిజా ప్రభాకర్, తన్మయి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా గ్రామీణ వాతావరణం నేపథ్యంలో సాగుతుందని..వ్యవసాయం చేసే రైతుకు పెళ్లి చేసుకోవడానికి పిల్లనివ్వక పోవడం, వ్యవసాయాన్ని చిన్న చూపు చూడకూడదనే కాన్సెప్ట్ తోపాటు ఫ్యామిలీ, ఎంటైర్టైన్మెంట్, యువత కు సందేశమిచ్చే రీతిలో చిత్రాన్ని రూపొందించామని దర్శకుడు తెలిపారు. కథ, మాటలు, పాటలు, సంగీతం, ఫోటో గ్రఫీ చిత్రనికి హైలెట్ గా ఉంటాయని ధన్ రాజ్ అన్నారు. చిత్ర నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాలు హైదరాబాద్ స్టూడియోలో నడుస్తున్నాయనీ దర్శకుడు ధన్ రాజ్ లెక్కల అన్నారు. గరుడవేగా అంజి ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డారని, హేచికీతా సినిమాలో నటించిన నటీ, నటులు, సాంకేతిక వర్గానికి, చిత్ర షూటింగుకు సహకరించిన జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్, జగిత్యాల డిఎస్పీ రఘుచందర్, జగిత్యాల రూరల్, టౌన్ సీఐలు కృష్ణారెడ్డి, వేణుగోపాల్, పోలీస్ సిబ్బంది, ఆయా గ్రామాల ప్రజలు, అధికారులు, ఉద్యోగులకు చిత్ర యూనిట్ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఐతే ఈ చిత్రంలో జగిత్యాలకి చెందిన జబర్దస్త్ అజయ్ ,మై విలేజ్ షో అంజిమమా,డ్యాన్సర్ రాకేష్, కొత్తపల్లి శ్రీను, సంధ్యారాణి,అలేఖ్య, రాపర్తి రవి,పోలీస్ మల్లయ్య, లెక్కల నారాయణల, మాణిదీప్ రావు, రఘులు అసిస్టెంట్ డైరెక్టర్లుగా అవకాశం లభించింది. సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్, ఎడిటర్ బలగం మధు, కోరి్యోగ్రాపర్ గా ఈశ్వర్ పెంటి వ్యవహరించిన హే చికితా సినిమాను మే లేదా జూన్ నెలలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోందని దర్శకుడు తెలిపారు.
