Take a fresh look at your lifestyle.

పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీతో నిజమైన ఆహార భద్రత

  • ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్
  • రేషన్ సన్న బియ్యంతో లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన ఎమ్మెల్యే, కలెక్టర్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: పేద ప్రజలకు సన్న బియ్యం పంపిణీతో నిజమైన ఆహార భద్రత పాటు పేదల కళ్లలో ఆనందం వెల్లివిరిసిందని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం గ్రామంలో మంజునాథ మహిళ సమాఖ్య సేర్ఫ్ ఆధ్వర్యంలో 2024-25 యాసంగి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తో కలిసి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సన్న బియ్యం పంపిణీ పథకంలో లబ్ధిదారుడు కోల సంజీవ్ గృహంలో వారి కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే, కలెక్టర్ సహపంక్తి భోజనం చేశారు.కుటుంబ సభ్యుల యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సన్న బియ్యం పంపిణీ తో అడ్డుకట్ట పడే అవకాశం ఉందని అన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన ముఖ్యమంత్రి, ఇంచార్జీ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డికి జగిత్యాల నియోజకవర్గ ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నన్నారు. ఉచిత కరెంట్, రూ. 500కు సిలిండర్, ఉచిత బస్సు, 4 ఎకరాలకు రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ యువ వికాసం తదితర పథకాలతో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో అధికారుల, ప్రజా ప్రతినిధులు పాత్ర గొప్పగా ఉండాలి అని అన్నారు. అంతర్గాం ఆదర్శ రైతు గ్రామమని, యాసంగి పెద్ద ఎత్తున వరి ధాన్యం దిగుబడి రానుందన్నారు. పంట మార్పిడితో కొయ్య, మొక్క జొన్న వేయగా రైతులకు లాభ సాటిగా మారిందన్నారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవతో సన్న వడ్లకు క్వింటాల్ కు 500 బోనస్ తో, జిల్లాలో 15 కోట్ల బోనస్ అందించడం జరిగిందని, గత వేసవిలో వడ్లకు కటింగ్ లేకుండా కొనుగోలుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. అకాల వర్షాలు నేపధ్యంలో రైతులు జాగ్రత్తలు తీసుకోవాల్సి అవసరం ఉందని అన్నారు. ప్రతి గ్రామం లో 120 నుండి 200 మెట్రిక్ టన్నుల గోదాంలు నిర్మాణం అవసరం ఉందని, ఈ గోదాములు నిర్మాణం వల్ల గన్ని సంచులు, మహిళ సమాఖ్య మీటింగ్, విత్తనాలు, పర్టిలైజర్ నిల్వకు ఉపయోగపడతాయని, జిల్లా పాలనాధికారి చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వానికి అంచనాలు పంపాలని కోరుతున్ననని తెలిపారు. నేషనల్ హై వే విస్తరణతో బైపాస్ లో ఉన్న ఏర్పాటుతో 45 పేద ప్రజల ఇండ్లు కోల్పోయే అవకాశం ఉందని, ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవకాశం కల్పించాలన్నారు. అంతర్గాం డబల్ బెడ్ రూం ఇండ్లకు కరెంట్ నీళ్ళ, ఇతర వసతికి కలెక్టర్ 10 లక్షలు మంజూరు చేశారని తెలిపారు. కేజీబీవీ, మహిళ రెసిడెన్షియల్ కళాశాల గ్రామంలో ఏర్పాటు చెయలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ జితేందర్ రెడ్డి, ఎమ్మెర్వో శ్రీనివాస్, ఎంపీడీవో రమాదేవి, ఎడిఎ తిరుపతి నాయక్, ఎపీఎం గంగాదర్, నాయకులు నక్కల రవీందర్ రెడ్డి, బోనగిరి నారాయణ, కొట్టాల మల్లారెడ్డి, నోముల శేఖర్ రెడ్డి, బాలు, స్వామి రెడ్డి, శ్రీనివాస్ ,మల్లారెడ్డి ,చెరుకు జాన్, బాలముకుందం, నారాయణరెడ్డి ,రాజేశ్వర్ రెడ్డి, అంజన్న, అంకం సతీష్,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.