- సునీతమ్మ తస్మాత్ జాగ్రత్త – చైతన్య మహేందర్ రెడ్డి.
తుర్కపల్లి,ముద్ర: ప్రజల్లో ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారు. సునీతమ్మ తస్మాత్ జాగ్రత్త అంటూ ఆలేరు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ అయినాల చైతన్య మహేందర్ రెడ్డి హెచ్చరించారు. తుర్కపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. పదేండ్ల పాలనలో అభివృద్ధి చేయడం చేతకాక అసమర్ధ పాలనను మూటగట్టుకున్న మీరా మా ఎమ్మెల్యేను విమర్శించేదంటూ మండిపడ్డారు. తుర్కపల్లి మండలం తిరుమలపురం గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు వేలాది మంది ప్రజలు తరలివచ్చి రేవంత్ ప్రభుత్వానికి జేజేలు కొట్టి విజయవంతం చేయడంతో గొంగిడి దంపతులకు నిద్ర పట్టడం లేదన్నారు. మెడికల్ కాలేజ్ ని మేము తెచ్చాం మేము తెచ్చాం అని చెప్పుకునే మీరు ఒక్క గుంట భూమి కానీ, ఒక్క రూపాయి కానీ మెడికల్ కాలేజీకి కేటాయించిన పాపన పోలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెడికల్ కాలేజీకి నిధులు కేటాయించి, శంకుస్థాపన చేసి, స్థలాన్ని కేటాయిస్తుంటే గప్పలు గొప్పలు చెప్పుకునే మీరు అమరణ నిరాహార దీక్ష చేయడం సిగ్గుచేటు అనిపించడం లేదా అని ప్రశ్నించారు. అనంతరం తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శంకర్ నాయక్ మాట్లాడుతూ.. గొంగిడి సునీత మహేందర్ రెడ్డి దంపతులు ఆలేరు నియోజకవర్గానికి దుష్టశక్తులగా మారి అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.రాష్ట్రంలో కొరివి దయ్యాలకు,ఆలేరులో దుష్టశక్తులకు ప్రజలు బుద్ది చెప్పిన కుక్క తోక వంకర అన్నట్లు బుద్దులు మాత్రం మారడం లేదని అన్నారు.బుద్ది చెప్పడం కాదు ఈ సారి కొరివిదయ్యలను, దుష్టశక్తులను పూర్తిగా భూ స్థాపితం చేయాలనీ కోరారు.గందమల్ల రిజర్వర్ ఏర్పటైతే సుమారు 60వేల ఎకరాలకు పైగా సాగులోకి వస్తుందని, తద్వారా వెలమంది రైతున్నలు బాగుపడుతారని ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కంకణం కట్టుకొని నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డీతో శంకుస్థాపన చేయించడాని కొనియాడారు.పదేండ్లు రిజర్వాయరు పేరుతో కాలయాపన చేసి,రైతులను మభ్యపెట్టారని తెలిపారు. వాసాలమర్రి గ్రామాన్ని దత్తత పేరుతో నాశనం చేశారాని అన్నారు.బిసి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఎదుగుదలను, ఓర్వలేని బిఆర్ఎస్ నాయకులకు ఏమి చేయాలో అర్ధం కాక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.బిఆర్ఎస్ నాయకులు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.సొంత నిధులతో 122 చెరువులను నింపిన ఘనత మా ఎమ్మెల్యేదేనాని కొనియాడారు.మాజీ ఎమ్మెల్యే ప్రతిపక్ష పాత్ర పోషించాలి కానీ కులాల మధ్య చిచ్చులు పెట్టి,వెన్నుపోట్లు పొడిచే బుద్ది సరికదాని అన్నారు.