Take a fresh look at your lifestyle.

హోటళ్లలో గృహావసర సిలిండర్ల స్వాధీనం

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నిర్మల్ పట్టణం లోని పలు హోటళ్లలో రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ దేశాల మేరకు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం 16 హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో గృహావసరాలకు కేటాయించిన 29 సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో చట్టానికి విరుద్ధంగా గృహ అవసరాల కొరకు కేటాయించిన సిలిండర్లను వ్యాపార అవసరాల కొరకు ఉపయోగించరాదని అధికారులు ఆదేశించారు. డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్ అవసరాల కొరకు ఉపయోగిస్తే, చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని అధికారులు తెలిపారు

Leave A Reply

Your email address will not be published.