Take a fresh look at your lifestyle.

కులాంతర వివాహం చేసుకున్నoదుకు కన్నతల్లి చనిపోయిన రాని కన్నకొడుకు

  • కూతూరే తలకొరివి పెట్టిన దృశ్యం.

సూర్యాపేట, ముద్ర ప్రతినిధి: సూర్యాపేట జిల్లా పరిధిలోని సీతారాంపురం కాలనీ లో కులాంతర వివాహం చేసుకున్నoదుకు కన్నతల్లి చనిపోయినా కన్నకొడుకు రాకపోవడంతో కూతూరే తలకొరివి పెట్టిన సూర్యాపేట జిల్లా పరిధిలోకి 23 వ వార్డులో ఆదివారం జరిగింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సీతారాంపురం కాలనీలో నివాసం ఉంటున్న నర్సింగ్ అంజయ్య చంద్రకళ దంపతులకు కుమారుడు, కుమార్తె సంతానం ఉన్నారు. కూతురు ప్రేమించి ఎస్సీ కులానికి చెందిన చింత వినయ్ బాబు ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2015 సంవత్సరంలో ఎస్సీ కులానికి చెందిన వారిని చేసుకున్నవనే సాకుతో చెల్లెకు ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని తన తల్లి నర్సింగ్ చంద్రకళ కుమారుడు నర్సింగ్ నవీన్ కుమార్ తల్లి ఆరోగ్యం బాగాలేదని హైదరాబాదుకు తీసుకువెళ్లి 24.వ తారీఖున హాస్పటల్లో జాయిన్ చేశాక ఈనెల 27.వ తారీకున తల్లి నర్సింగ్ చంద్రకళ చనిపోయింది. కూతురు వసంతకు సమాచారం అందించలేదు. దూరపు బంధువులు మీ అమ్మ ఆరోగ్యం బాగాలేదని, హాస్పిటల్ లో అడ్మిట్ అయిందని చెప్పడంతో తన తల్లిని చూడడానికి హాస్పిటల్ వెళ్లేసరికి నర్సింగ్ చంద్రకళ చనిపోయి ఉన్నది. అమ్మ చనిపోయింది అని సమాచారం ఎందుకు లేదని అన్నయ్య వదినలను అడగగా నువ్వు ఎస్సీ కులానికి చెందిన వాడిని పెళ్లి చేసుకున్నావని, మీకు మాకు ఎలాంటి సంబంధం లేదని, నీకు ఆస్తిలో కూడా వాటలేదని అమ్మను తీసుకువెళ్లి ఎక్కడైనా దహన సంస్కారాలు చేసుకోమని హెచ్చరించాడు. గొడవకు దిగారు. ఈ తెలుసుకున్న తన భర్త చింత వినయ్ బాబు హైదరాబాద్ హాస్పిటల్ లో నుంచి తన అత్తగారైన చంద్రకళను తీసుకొచ్చి సూర్యాపేటలో ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషయాన్ని గమనించిన పెద్దలు దహన సంస్కారాలు సంస్కరి సహకరించి కూతురు అల్లుడు ను అభినందించారు. ఆధునికంగా మానవుడు అభివృద్ధి చెందుతున్న ఈ రోజులలో కూడా కులం పేరుతో, మతం పేరుతో కొట్టుకు చావడం, కుటుంబంలో వర్గ విభేదాలు, తగాదాలు పెట్టుకోవడం సరికాదని పలువురు పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.