– రూ.15 వేల విలువైన ఉక్కా స్వాధీనం.
– వస్త్ర దుకాణాల్లో అమ్మకాలు చేస్తున్న వ్యాపారులపై మూడు కేసు నమోదు.
ప్రజల ఆరోగ్యాలను హరించే వ్యాపారాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు అని సూర్యాపేట జిల్లా కె. నరసింహ ఐపిఎస్ గారు హెచ్చరించారు.
నమ్మదగిన సమాచారం మేరకు సూర్యాపేట పట్టణ పోలీసులు సూర్యాపేట పట్టణం మెయిన్ రోడ్ నందు గల ఆర్.వి ఫ్యాషన్స్, ఎక్స్ట్రీమ్ ఫ్యాషన్స్ వస్త్ర దుకాణాల నందు ఉక్కా అమ్మకాలు నిర్వహిస్తున్నారు అనే సమాచారం పట్టణ పోలీసులు తనిఖీలు నిర్వహించగా 15వేల రూపాయల విలువైన ఉక్కా ప్యాకెట్లు దొరికనైనది అని ఎస్పి నరసింహ ఐపిఎస్ గారు తెలిపినారు. దీనికి సంభందించి ముగ్గిరిపై కేసు నమోదు చేయడం జరిగినది అన్నారు. ప్రజల ఆరోగ్యాలను హరించే ఇలాంటి వ్యాపారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పి గారు హెచ్చరించారు, దీనిని సేవించడం వల్ల ఆరోగ్యాలు నాశనం అవుతాయని అన్నారు. యువత ఇలాంటి చెడు అలవాట్లకు లోనుకావొద్దు అని తెలిపారు. ఇలాంటి అమ్మకాలకు సంబంధించిన సమాచారం పోలీసు వారికి తెలియజేయాలని కోరారు.