జిల్లా ఉద్యమకారులపై నమోదైన కేసు కొట్టివేత ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పై దాడి చేశారని అప్పట్లో కేసు నమోదు
ముద్ర, నారాయణపేట:
నారాయణపేట నూతన జిల్లా ఏర్పాటు విషయంపై అప్పట్లో పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగింది. ఇదే సందర్భంలో 2016లో నారాయణపేట పట్టణంలోని పర్మరెడ్డి కాలనీలో గల ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంపై జిల్లా ఏర్పాటు ఉద్యమ విషయమై దాడి చేశారని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ బాయ్ ఫిర్యాదు మేరకు సుమారు 12 మంది వ్యక్తులపై కేసులు నమోదయ్యాయి. 2017 మార్చ్ 15న చార్జి షీట్ నమోదు చేశారు. ఇందులో ఏ1 గా మాజీ కౌన్సిలర్ వినోద్, ఏ 2 గా కొండా సత్య యాదవ్, ఏ 3 గా వెంకటేష్ గౌడ్ తో పాటు మరికొంతమంది పై 147, 148,452,324,353,427 r/w 149 సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. కేసు విచారణ గురువారం నారాయణపేట కోర్టులో బెంచ్ మీదకు రాగ కేసుకు సంబంధించిన సరైన సాక్షాదారులు లేకపోవడంతో కేసును కొట్టివేసినట్లు న్యాయవాది ప్రవీణ్ నామాజీ తెలిపారు.