Take a fresh look at your lifestyle.

జ్యోతిరావు పూలే ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలి : జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు కొప్పుల వెంకట్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
జ్యోతిరావు పూలే ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా సర్పంచుల పోరం అధ్యక్షులు కొప్పుల వెంకట్ రెడ్డి అన్నారు. శనివారం జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వెంకట్ రెడ్డి మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే గొప్ప సంఘసంస్కర్త అని ఆయన సమాజ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి అని నేడు మహిళలకు అన్ని రంగాలలో అవకాశం కల్పించిన వ్యక్తి పూలే అని కొనియాడారు. రాబోయే రోజుల్లో నేటి యువత జ్యోతిరావు పూలే సిద్ధాంతాలను ఆశయాలను ఆదర్శంగా తీసుకొని సమాజ అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సామాజిక వేత జ్యుడీషియల్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ అధికారి ఎం బాలేశ్వర్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.