మహాదేవపూర్, ముద్ర:
గ్రామాన్ని పరిశుభ్రంగా అందంగా ఉంచడమే తన లక్ష్యమని గ్రామ సర్పంచ్ హసీనా భాను 8వ వార్డులో ప్రజలను ఉద్దేశించి అన్నారు. ఈ వార్డులో రోడ్డుకు ఇరువైపుల ఉన్న వ్యర్థాలు, పిచ్చి మొక్కలను సర్పంచ్ హసీనాభాను ఆధ్వర్యంలో గ్రామపంచాయతి సిబ్బంది తొలగించారు. రోడ్ల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించిన గ్రామ సర్పంచ్ హసీనా బాను అక్బర్ ఖాన్, ఉపసర్పంచ్ మరియు వార్డు సభ్యులతో కలిసి 8వ వార్డును సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. గ్రామపంచాయతి సిబ్బంది నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనులను స్వయంగా పర్యవేక్షించారు.గ్రామంలో సమస్యలు ఉంటే ప్రజలు నేరుగా తనకు తెలియజేయాలని, వెంటనే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉంటానని సర్పంచ్ హసీనా బాను అన్నారు. వీరి వెంట ఉప్పర్ సర్పంచ్ తుంగల శ్రీజ, చీర్లవంచ చంద్రశేఖర్, మహ్మద్ బిన్ అలీ, నల్ల బుగ్గ సమ్మయ్య, నయుముద్దీన్, కొండపల్లి రాములు పారిశుద్ధ్య సిబంది పాల్గొన్నారు.