Take a fresh look at your lifestyle.

జూలై 19, 20 తేదీల్లో మధిరలో సిపిఐ జిల్లా సభలు

  • ఈ నెల 14న మహాసభల ఆహ్వాన సంఘ సమావేశం.
  • సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బెజవాడ రవిబాబు.

మధిర, ముద్ర విలేఖరి: జూలై 19, 20 తేదీల్లో మధిరలో నిర్వహించనున్న సిపిఐ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బెజవాడ రవిబాబు, మందడపు రాణి పిలుపునిచ్చారు. మంగళవారం మధిరలో జరిగిన పార్టీ సమావేశంలో వారు మాట్లాడుతూ ఈనెల 14వ తేదీన మధిర రిక్రియేషన్ క్లబ్ నందు జిల్లా మహాసభల ఆహ్వాన సంఘ సమావేశానికి సిపిఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు, జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్, రాష్ట్ర సమితి సభ్యులు జమ్ముల జితేందర్ రెడ్డి రానున్నట్లు తెలిపారు. సిపిఐ పార్టీ భారతదేశంలో ఆవిర్భవించి వంద సంవత్సరాలు అయిందని ఇప్పటివరకు దేశంలో ఏ పార్టీకి 100 సంవత్సరాల చరిత్ర లేదన్నారు. జిల్లా మహాసభల్లో సీపీఐ పార్టీ ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలను సమీక్షించుకోవడంతోపాటు, భవిష్యత్‌ పోరాటాల కార్యచరణ ప్రణాళికకు రూపకల్పన చేయనున్నట్లు తెలిపారు.14న స్థానిక రిక్రియేషన్ క్లబ్ నందు జరిగే జిల్లా మహాసభల ఆహ్వాన సంఘం సమావేశానికి పార్టీ శ్రేణులు, ఆభిమానులు, వామపక్ష కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని వారు ఈ సందర్భంగా కోరారు.ఈ సమావేశం లో సిపిఐ మధిర మండల కార్యదర్శి ఊట్ల కొండల్ రావు, జిల్లాసమితి సభ్యులు ఎం ఏ రహీమ్,పెరుమాళ్ళపల్లి ప్రకాశరావు, మడుపల్లి లక్ష్మణ్,చావా మురళి, ఏఐటీయూసీ డివిజన్ కార్యదర్శి చెరుకూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.