Take a fresh look at your lifestyle.

ప్రజాస్వామ్య రక్షణే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ లక్ష్యం

  • రాహుల్ గాంధీ పిలుపు తో మంత్రి జూపల్లి చైతన్య యాత్ర.

ముద్ర,వీపనగండ్ల: 200 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ వారిని శాంతియుత పోరాట మార్గంలో పోరాడి సాధించిన స్వాతంత్రదేశానికి మార్గ నిర్దేశం చూపుతూ రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర పాలకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్ సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఉమ్మడి వీపనగండ్ల మండలంలోని గూడెం , బెక్కేం గ్రామాలలో మంగళవారం మంత్రి జూపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ 200 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ వారిని శాంతియుత పోరాట మార్గంలో పోరాడి సాధించిన స్వాతంత్రదేశానికి మార్గ నిర్దేశం చూపుతూ రాజ్యాంగాన్ని రచించిన బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర పాలకులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. గాంధీ ని, అంబేద్కర్ ని అవమానిస్తున్న మతోన్మాద పార్టీలు, రాజ్యాంగాన్ని మార్చి మనువాదాన్ని అమలు చేయాలని చూస్తున్నారని ఈ సందర్భంగా మన రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని ప్రజలకు వివరించారు.బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా దేశ పౌరులకు స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, అవకాశాలు కల్పిస్తూ ఈ దేశానికి ఒక మార్గ నిర్దేశం చేశారని, అలాంటి అంబేద్కర్ పై కేంద్ర మంత్రులు అనుచితక వాక్యాలు చేయడం సరికాదని ఈ సందర్భంగా గుర్తు చేశారు.మహాత్మా గాంధీ సిద్ధాంతాన్ని, అంబేడ్కర్ ఆలోచన విధానాన్ని, భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడడం కోసం కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ రాజ్యాంగ సంరక్షణ యాత్ర మొదలుపెట్టారని,ఈ యాత్ర ద్వారా భారత పౌరులను మేలు కొలిపి మతోన్మాద శక్తుల ను ఎండగడదామని జూపల్లి ప్రజలకు పిలుపునిచ్చారు.బెక్కెం గ్రామంలో స్వయంగా రాష్ట్ర మంత్రి జూపల్లి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మంచినీటి తో శుభ్రపరచి యువత విగ్రహాలు పెట్టడమే కాదు, జాతీయ నాయకుల విగ్రహాలను నిత్యం శుభ్రంగా ఉంచుకోవాలని , ఆ జాతీయ నాయకులనుంచి స్ఫూర్తి పొందాలని యువతకు పిలుపునిచ్చారు.తెలంగాణ సాధించుకున్న తర్వాత అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చి వాగడంబరాల పరిపాలన చేసిందని దుయ్యబట్టారు.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసుకుంటూ పోతుందని, ఇచ్చిన వాగ్దానాలు అమలుపరుస్తుంటే ఓర్వలేని ప్రతిపక్ష పార్టీలు నిత్యం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి కుట్టిల ప్రయత్నాలు చేస్తున్నాయని జూపల్లి రాష్ట్ర పరిస్థితులను వివరించారు. కార్యక్రమంలో చిన్నంబావి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, కొల్లాపూర్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ రామచంద్రారెడ్డి, నాయకులు కళ్యాణ్ రావు, బీచుపల్లి యాదవ్, చిదంబ రెడ్డి,తేజా రెడ్డి, నాగరాజు, తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.