ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల బాలుర ప్రాథమిక పాఠశాల విద్యార్థులు 5వ తరగతి గురుకుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష–2026 మొదటి విడత ఫలితాల్లో విశేష ప్రతిభ కనబరిచారు. పాఠశాల నుంచి మొత్తం ఎనిమిది మంది విద్యార్థులు గురుకుల సీట్లు సాధించడం గర్వకారణంగా నిలిచింది.
సీట్లు సాధించిన విద్యార్థులు: పాత్కుల రిషిత్ కుమార్, పాత్కుల కౌశిక్, నడిగడ్డ విగ్నేష్, ఆలూరి చంటి, పొట్టల శ్రీనిధి, మధనాగుల అలేఖ్య, గోరటి మాధవి, ఆలూరి హర్బిక.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, ఉపాధ్యాయులు వెంకటేష్, ఆంజనేయులు, చందన, సంగీత విద్యార్థులను అభినందించారు. భవిష్యత్తులో మరింత కృషి చేసి ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు.
పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన బోధనతో పాటు గురుకుల ప్రవేశ పరీక్ష కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు.
విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు మండల విద్యాశాఖాధికారి చంద్రశేఖర్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులను అభినందించి, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశీర్వదించారు. అలాగే ఉపాధ్యాయుల కృషిని ప్రశంసించారు