- 420 రోజులైనా ఇచ్చిన 420 హామీలను అమలు చేయకపోవడం శోచనీయం
- మాజీ శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్
- మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేసిన మాజీ ఎమ్మెల్యే
తుంగతుర్తి ముద్ర :- కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 420 హామీలను అధికారంలోకి వచ్చి 420 రోజులైనా అమలు చేయకపోవడం శోచనీయమని మాజీ శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అన్నారు. గురువారం రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు నియోజకవర్గ కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి 420 హామీలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ వినతిపత్రం అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీలను ఏ ఒక్క హామీని కూడా సంపూర్తిగా అమలు చేయకపోవడం ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. రైతు రుణమాఫీ ,రైతుబంధు, లాంటి రైతు పథకాలతో పాటు మహిళలకు ఇచ్చిన హామీలను అలాగే రైతు కూలీలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని అన్నారు.
ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా వాటిపై కుంటి సాకులు చెబుతున్నారని అన్నారు. పరిపాలన అనుభవం లేక ప్రభుత్వ పెద్దలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని చెప్పిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్ష పార్టీగా తాము డిమాండ్ చేస్తున్నామని అందులో భాగంగానే మహాత్మా గాంధీ విగ్రహానికి నేడు వినతిపత్రం అందించామని అన్నారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని అభివృద్ధి సంక్షేమ పథకాలు ఆవిరైపోయాయని కొత్త పథకాలు ఇస్తామని చెప్పి పాత పథకాలకు స్వస్తి చెప్పారని అన్నారు. తాము శంకుస్థాపన చేసిన పనులకే తిరిగి కొబ్బరికాయలు కొట్టారని ఆ పనులు కూడా ఇంకా ప్రారంభించకపోవడం విచారకరమని అన్నారు.
కాంగ్రెస్ పాలన పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తిరిగి ప్రజలు కేసీఆర్ పాలన వైపు చూస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు, మండల పార్టీ అధ్యక్షుడు మాజీ ఎంపీపీ తాడికొండ సీతయ్య, జిల్లా రైతుబంధు మాజీ చైర్మన్ రజాక్, బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు దొంగరి శ్రీనివాస్, గోపగాని శ్రీనివాస్, పూర్ణా నాయక్ ,లతోపాటు పలువురు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు పిఎసిఎస్ డైరెక్టర్లు అలాగే బిఆర్ఎస్వి ,బి ఆర్ ఎస్ వై నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.