Take a fresh look at your lifestyle.

లారీ ఢీకొని వృద్ధుని మృతి

 

ముద్ర, కోరుట్ల;
ఇబ్రహీంపట్నం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన కోట రాజన్న 78 అనే వృద్ధుడు లారీ ఢీకొని మృతి చెందాడు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన కోట రాజన్న 78 అనే వృద్ధుని ఇల్లు హైవేను అనుకొని ఉంది. ప్రతిరోజు ఉదయం సమయంలో హైవే రోడ్డు దాటి మొహం కడుక్కోవడానికి బోరు దగ్గరికి వెళ్లేవాడు అదే క్రమంలో శుక్రవారం రోజు ఉదయం సమయంలో మొహం కడుక్కోని తిరిగి రోడ్డు దాటుతున్న క్రమంలో మెట్పల్లి నుంచి ఆర్మూరు వైపు వెళుతున్న లారీ అతివేగంగా అజాగ్రత్తగా వచ్చి రాజన్న ను డీ కొట్టగా మృతుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కొడుకు రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై జీ. నవీన్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.