Take a fresh look at your lifestyle.

నాగర్ కర్నూల్ పట్టణ మున్సిపాలిటీలో సాధారణ సమావేశం సమావేశానికి ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి హాజరయ్యారు.

 

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో రోడ్ల అభివృద్ధికి ఇప్పటికే రూ.56 కోట్లు వ్యయం చేసి పనులను పూర్తి చేసినట్లు తెలిపారు. అలాగే డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి కోసం రూ.40 కోట్లతో పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

పార్టీ భేదాలకు అతీతంగా పట్టణ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని, భవిష్యత్తులో కూడా నాగర్ కర్నూల్ అభివృద్ధికి తాను పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.

అనంతరం మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ హాల్ నిర్మాణానికి సంబంధించి మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, వైస్ చైర్మన్ బాదం రమేష్ మరియు కౌన్సిలర్లు కలిసి ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పించారు.

దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కౌన్సిల్ మీటింగ్ హాల్ నిర్మాణానికి రూ.1 కోటి మంజూరు చేయించేందుకు హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.