ముద్ర ప్రతినిధి, మెదక్:
యూరియా, గ్యాస్ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ నగేష్ హెచ్చరించారు. పాపన్నపేట మండల కేంద్రంలో రైతు అగ్రో సెంటర్, ప్యాక్స్ యూరియా, గ్యాస్ గోదామును సందర్శించారు. ఎరువులు, మందుల రికార్డులను, గ్యాస్ బుకింగ్ రికార్డును పరిశీలించారు. జిల్లాలో ఎలాంటి ఎరువులు, మందులు, గ్యాస్ కొరత లేదన్నారు. గ్యాస్, ఎరువులు, మందుల కృత్రిమ కొరత సృష్టిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను సూచించారు.

విద్యార్థులకు మెనూ తప్పక అమలు చేయాలి
విద్యార్థులకు మెనూ తప్పక అమలు చేయాలని అదనపు కలెక్టర్ నగేష్ అధికారులకు సూచించారు. టేక్మాల్ మండల కేంద్రంలో విస్తృతంగా పర్యటించారు. ఆగ్రో సేవా కేంద్రం, గ్యాస్ గోదాం పరిశీలించారు. కేజీవీబీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేజీవీబీ పాఠశాలలో స్టోర్ రూమును, కిచెన్, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. కేజీవీబీ పాఠశాలలో నాణ్యమైన భోజనం, ఉచిత విద్యా అందించాలని తెలిపారు. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. విద్యార్థులతో కలిసి భోజనం రుచి చూశారు.
ఆగ్రో సేవా కేంద్రంలో పలు రికార్డులు, స్టాక్ వివరాలు పరిశీలించారు.
రైతులకు అన్ని మందులు, ఎరువులు అందుబాటులో ఉంచాలని, యూరియాను త్వరితగతిన అందించాలన్నారు. గ్యాస్ వినియోగదారులు గ్యాస్ సమస్యపై చింతించాల్సిన అవసరం లేదన్నారు. జిల్లాలో సరిపడ గ్యాస్ సిలిండర్లు ఉన్నాయన్నారు. గ్యాస్ సమస్యను సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వెంట సంబందిత అధికారులు, సిబ్బంది ఉన్నారు.