ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా
పెద్దేముల్ మండలం కందెనెల్లి గ్రామంలో రూ.7 లక్షలతో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రహరీ గోడను ప్రారంభించిన తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి

అనంతరం కందనెల్లి కవితలు మరియు తాటికొండ మణిపూసలు, గాయత్రి మణిపూసలు పుస్తకాలను ఆవిష్కరణ చేసి, అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ పుస్తకాలు రచించిన వడిచర్ల సత్యం గారిని, బింగి గాయత్రి, తాటికొండ అర్చన ను, విద్యార్థులను ప్రోత్సహించిన ఉపాధ్యాయులను అభినందించారు. కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ దారాసింగ్, పార్టీ నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు