ముద్ర, శేరిలింగంపల్లి: మాదాపూర్ లోని శిల్పారామంలో చత్తీస్గడ్ గాంధీ శిల్పబజార్ హస్తకళా ఉత్సవం సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంది. బస్తర్ జిల్లాకు చెందిన గోండ్ పెయింటింగ్, మెటల్ క్రాఫ్ట్స్, వెదురుతో తయారు చేసిన వస్తువులు గురుఅలంకరణ వస్తువులు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఈరోజు ఒడిస్సి మరియు కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. శ్రీమతి సుస్మిత మిశ్ర గారి శిష్య బృందం ఒడిస్సి నృత్య ప్రదర్శనలో శుక్లాం బరధరం, స్థాయి, శ్రీహరిస్తోత్రం, బసంత్ పల్లవి, సంజనిరి, తరంగ్, మొఖ్య అంశాలను దివ్యశ్రీ , ఆర్వీ, సౌమ్య, ఆద్య, సంప్రీతి, అంకిత, తన్వి మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు. కూచిపూడి నృత్య ప్రదర్శనలో శ్రీమతి నిహారిక చౌదరి గారి శిష్య బృందం దంతం భజామి, బ్రహ్మాంజలి, జతిస్వరం, దశావతార శబ్దం, అన్నమాచార్య, శివ తాండవ స్తోత్రం, జావళి, కూచిపూడి తల్లికి వందనం మొదలైన అంశాలను సమన్వి, లాలిత్య, మనస్విని, శ్రీష్టి, శృతి, నిత్య, హిమాన్వి, కైరా, నైనికా, మొదలైన వారు ప్రదర్శించి మెప్పించారు.