Take a fresh look at your lifestyle.

మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే

ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
……………………………………..
మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని పలువురు కొనియాడారు. శనివారం ఆయన జయంతి సందర్బంగా మహబూబ్ నగర్ పద్మావతి కాలనీ లోని విగ్రహాన్నికి పూలమాల వేసి నివాళులర్పించారు.

 

నగర మేయర్ గుమ్మల మమత,జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా,డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అనిత,డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి,మూడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గ్రంథాలయ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి ఫూలే విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళ్లు అర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కుల వ్యవస్థ నిర్మూలన,మహిళా విద్య కోసం పాటుపడిన తొలి సామాజిక వేత్త అని కొనియాడారు.మనుషులను మహోన్నతులుగా తీర్చిదిద్దేది కేవలం విద్య మాత్రమే తెలిపిన మహానేత మహాత్మ జ్యోతిరావు పూలే ఆలోచనలు మన అందరికి మార్గదర్శనం అని అన్నారు.ఆయన చూపిన మార్గం లో మనమందరం నడవాలన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, గొర్రెల కాపర్ల సంఘం అధ్యక్షులు అధ్యక్షులు శాంతయ్య, మైత్రి యాదయ్య, రాములు, సాయిలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.