Take a fresh look at your lifestyle.

లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ

ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
……………………………………..
జడ్చర్ల నియోజకవర్గం లోని
మిడ్జిల్ మండల ఎంపీడీవో కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 65 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను శనివారం జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జడ్చర్ల నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి, తండాలకు బీటి రోడ్లను మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, ఐ ఐ ఐటీ కళాశాల, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను మంజూరు చేయడం ద్వారా పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు కృషి చేస్తోందని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ 23న మిడ్జిల్ మండల కేంద్రానికి రానున్నారని ఎమ్మెల్యే వెల్లడించారు.మిడ్జిల్, ఉర్కొండ మండలాల అభివృద్ధికి భారీ ఎత్తున నిధులను సీఎం మంజూరు చేస్తారన్నారు.
మిడ్జిల్ మండల కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందని, ఉర్కొండలో ఇదే పరిస్థితి ఉందన్నారు. ఈ అంశంపై త్వరలోనే పూర్తి ఆధారాలతో ప్రజల ముందుకు తీసుకువస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్ పర్సన్ తంగేళ్ల జ్యోతి , ఎమ్మార్వో ,స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.