ముద్ర, తాండూర్:
వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో సామాజిక సంస్కర్త, కుల వ్యతిరేక పోరాట యోధుడి199 వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ అంటరానితనం, కుల మత, లింగ వివక్షత కోసం అహర్నిశలు కృషిచేసి సత్యశోధక్ సమాజ్ను స్థాపించి, అణగారిన వర్గాల కోసం తన జీవితాన్నే అంకితం చేసిన యోధుడు జ్యోతిరావు పూలే అని వారు కొని ఆడారు. మహిళలకు విద్యను అందిస్తే సమాజం బాగుపడుతుందనే ఉద్దేశంతో తన భార్య సావిత్రిబాయి తో కలిసి పూణేలో బాలికల పాఠశాలను స్థాపించాడు. జ్యోతిరావు పూలే దంపతుల పుణ్యఫలితంగానే నేడు సమాజంలో మహిళలకు ఎంతో గుర్తింపు లభిస్తున్నదని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు సయ్యద్ సుకుర్, మహిళా అధ్యక్షురాలు అనిత, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బసవరాజ్, రమేష్, తదితర బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.