Take a fresh look at your lifestyle.

ప్రజల ఆర్జీలను సత్వరమే పరిష్కరించాలి -ప్రజావాణి ఫిర్యాదులపై అధికారులకు కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశం

 

(ముద్ర, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి):

సోమవారం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించిన ప్రజా వాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల ప్రజలు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డికి విన్నవించుకున్నారు. ఈమేరకు అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందించే వినతులను సంబంధిత శాఖల జిల్లా అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి( రెవెన్యూ), వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

ప్రజావాణికి(51)ఫిర్యాదులు

సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 51 ఫిర్యాదులు అందాయి. ఇందులో
రెవెన్యూ శాఖవి 11, ఇతర శాఖలవి 40, మొత్తం 51 దరఖస్తులు అధికారులకు అందాయి.
******

Leave A Reply

Your email address will not be published.