Take a fresh look at your lifestyle.

మురికి నీరు కలవకుండా పాపాయి కుంటను కాపాడండి -ఆకుల సతీష్ ,అల్లాడి మహేష్ ఆధ్వర్యంలోనిరసన వ్యక్తం చేసిన స్థానికులు

 

ముద్ర,కుత్బుల్లాపూర్:

 

పాపాయి కుంటను మురికి నీరు కలవకుండా రాజధాని స్కూల్ నుంచి డైవర్షన్ చేసి ఎస్ ఎన్ డి పి లో కలపాలని నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.నిరసన కార్యక్రమం ఆకుల సతీష్ అల్లాడి మహేష్ ఆధ్వర్యంలో కాలనీ ప్రజలతో కలిసి చేయడం జరిగింది.తురక చెరువు నుంచి పాపాయి కుంటలోకి మురికి నీరు వదలరాదని వారు డిమాండ్ చేశారు.
తురుక చెరువు నుంచి రాజధాని స్కూల్ మీదుగా బండారు నుండి వచ్చే ఎస్ ఎన్ డి పి నాలకి మురికి నీరు డైవర్షన్ చేయాలి కోరారు.పాపయ్య కుంట నుండి సిరి బాలాజీ దాకా రెండు కోట్లపై కేటాయించిన నిధులు తురుక చెరువు నుంచి బండారు లేఔట్ ఎస్ ఎన్ డి పి కి డైవర్ట్ చేయాలన్నారు.పాపాయి కుంటను2021 ముందులాగా మంచినీటి చెరువుగా తీర్చిదిద్దాలనిపాపయ్య కుంటలో తక్షణమే గుర్రపు డెక్కను తొలగించాలని వారు డిమాండ్ చేశారు.
అని డిమాండ్ చేస్తూ అధికారులకి /ప్రభుత్వానికి విషయం అర్థమయ్యే విధంగా నిరసన కార్యక్రమం ఆకుల సతీష్ అల్లాడి మహేష్ ఆధ్వర్యంలో కాలనీ ప్రజలతో కలిసి చేయడం జరిగింది. కార్యక్రమంలో కాలనీ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.