Take a fresh look at your lifestyle.

స్మశాన వాటిక అభివృద్ధికి నిధుల కోసం వినతి

 

ముద్ర : మల్కాజిగిరి

ఓల్డ్ నేరెడ్మెట్ ప్రాంతంలోని గౌడ సంఘం స్మశాన వాటిక అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ, మర్రి రాజశేఖర్ రెడ్డి గారికి గౌడ సంఘం నాయకులు వినతి పత్రం సమర్పించారు. మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
స్మశాన వాటికలో ప్రాథమిక సౌకర్యాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు ఎమ్మెల్యేను కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే, సమస్యను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం.
ఈ కార్యక్రమంలో ఈశ్వర్ గౌడ్, నరేందర్ గౌడ్, నర్సింహ గౌడ్, అభిషేక్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, తదితర గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు.
అదేవిధంగా బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు జనార్దన్, నవీన్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.