Take a fresh look at your lifestyle.

యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలి

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
ఇరాన్‌ పై అమెరికా ఇజ్రాయిల్‌ యుద్ధాన్ని వెంటనే నిలిపివేసి ప్రపంచ శాంతిని నెలకొల్పాలని సిపిఐ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ విగ్రహం ముందు సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏశాల అశోక్‌ మాట్లాడుతూ యుద్ధం వల్ల దేశంలో పెట్రోల్‌ గ్యాస్‌ కొరత ఏర్పడి ప్రజలు తీవ్రంగా అవస్థలు పడుతున్నారన్నారు. వెంటనే యుద్ధాన్ని నిలిపివేయాలని దీనికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్‌ చేశారు. యుద్ధం వద్దు ప్రపంచ శాంతి ముద్దు అని అన్నారు. యుద్ధం ఇదే విధంగా కొనసాగితే రాబోయే కాలంలో గ్యాస్‌ ఇంధన కొరత తో పాటు ఆహార ధాన్యాల కొరత ఏర్పడే ప్రమాదం ఉన్నదని ఆయన అన్నారు. ఈ నిరసన కార్యక్రమానికి సిపిఐ మండల కార్యదర్శి దాసరి లక్ష్మయ్య అధ్యక్షత వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ నాయకులు కోట శంకర్, చొప్పరి సత్తయ్య, ముసునూరు చంద్రశేఖర్‌ ఎండి బాబా, ఎండి ముస్తఫా, గుజ్జ సత్యనారాయణ, కూరాకుల అబ్బులు, నాగపురి యాదగిరి, అంకం నగేష్‌ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.