Take a fresh look at your lifestyle.

గడి స్థలాల రక్షణకు బిఆర్ఎస్ కౌన్సిలర్లు సంపూర్ణ మద్దతు

 

ముద్ర, కోరుట్ల;
పురాతన గడి బురుజులు, కోనేరు వాటి స్థలాలు రక్షించాలని, అక్కడ ప్రతి సంవత్సరం జరిగే విజయదశమి, బతుకమ్మ, గణేష్, మొహరం ఉత్సవాలు యదావిధిగా కొనసాగించాలని, ఆ స్థలాల్లో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అక్కడ మార్కెట్, ఆహ్లాదకరమైన పార్కు, మైసమ్మ, హనుమాన్ దేవాలయాల తో పాటు నిరంతరం ఎగిరే జాతీయ జెండా ఆవిష్కరించాలని కోరుతూ కమిటీ సంతకాల సేకరణతో పోరాటం కొనసాగిస్తున్నారు. ఈమధ్య ప్రజల ఆస్తిని కాపాడాల్సిన మున్సిపల్ అధికారులు, అదే ఆస్తిని అక్రమాలకు వేదికగా మార్చిన ఈ ఘటనలో బాధ్యులైన వారిని కఠిన చర్యలు తీసుకోవాలి అని అన్నారు. నకిలీ దస్తావేజులతో అక్రమ విఎల్టీలు వేసి ప్రజల ఆకాంక్షలను చెల్లాచెదురు చేసిన మున్సిపల్ అధికారులను సస్పెండ్ చేయాలని, ఆ విఎల్ టి లను రద్దు చేయాలని గత ఐదు రోజులుగా చేసిన నిరసన దీక్షల అనంతరం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులకు బిజేపి, బిఆర్ ఎస్ కౌన్సిలర్ లు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

Leave A Reply

Your email address will not be published.