ఇచ్చిన హామీలు ఎప్పటినుండి అమలు చేస్తారో చెప్పండి-విలేకరుల సమావేశంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఫైర్
డైవర్ట్ పాలిటిక్స్,డ్రామా పాలిటిక్స్ బండికి వెన్నతో పెట్టిన విద్య
బీఆర్ఎస్ తో రహస్య ఒప్పందం పెట్టుకుని కాంగ్రెస్ పై నిందలా
ఇండిపెండెంట్ లకు ఆగమేఘాల మీద కండువాలు కప్పింది మీరే కదా
ఇప్పటికైనా కరీంనగర్ ప్రజల అభివృద్ధి కోసం ఆలోచించండి
ప్రజలు బీజేపీ పార్టీ వాళ్ళను ఎంపి గా ఎమ్మెల్సీ గా మేయర్ గా గెలిపించారు ప్రజలకు కేంద్రం నుండి ఏం చేస్తారో చెప్పండి
ఇచ్చిన హామీలు ఎప్పటినుండి అమలు చేస్తారో చెప్పండి
రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది అందుకే ఇందిరమ్మ ఇళ్లు,200 యూనిట్ల విద్యుత్తు,ఉచిత బస్సుతో పాటు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నాం
బీజేపీ లాగా రాష్టానికి ఒక విధంగా పక్షపాత ధోరణి అవలoభిస్తాలేము
బీజేపీ ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలి
విలేకరుల సమావేశంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఫైర్
డైవర్ట్ పాలిటిక్స్,డ్రామా పాలిటిక్స్ కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు వెన్న తో పెట్టిన విద్య అని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు.కార్పోరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ మరియు నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు మల్లికార్జున రాజేందర్,గంట శ్రీనివాస్,వరాల నర్సింగం,పర్వతం మల్లేశం,కాంతాల జగన్ రెడ్డి లతో కలిసి ఆర్ అయిండ్ బి గెస్ట్ హౌజ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్ తో రహస్య ఒప్పందం చేసుకొని ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ పార్టీ పై బురుద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మా సందాన మేము కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లతో క్యాంపు పెట్టుకుంటే ఆగమేఘాల మీద ఇండిపెండెంట్ లకు బీజేపీ కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని నరేందర్ రెడ్డి విమర్శించారు. కరీంనగర్ ప్రజలు బీజేపీ ఎంపి ని బీజేపీ ఎమ్మెల్సీని బీజేపీ మేయర్ ను గెలిపించారని ఇప్పటివరకు బండి సంజయ్ కుమార్ కరీంనగర్ ప్రజలకు చేసిందేమీ లేదని ఇప్పటికైనా మొన్న కేంద్ర ప్రభుత్వం ద్వారా చేస్తామని అనేక హామీలు ఇచ్చారని వాటన్నిటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా చిత్తశుద్ధితో పని చేస్తుందని అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు పరస్తుందని ఇంకా మిగిలిపోయిన పథకాలు అమలు చేస్తామని అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని మీ చిత్తశుద్ధిని ప్రదర్శించమని నరేందర్ రెడ్డి కోరారు.ఇప్పటికైనా విజ్ఞులైన ప్రజలు బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతే ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు.ఈ విలేకరుల సమావేశంలో ఎండి చాంద్,ఎండి లయక్,ముల్కల కవిత,జ్యోతిరెడ్డి,వీర దేవేందర్,బషీర్,భారీ,కీర్తి కుమార్,హనీఫ్,ఫజల్,జమీల్,యోనా,నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.