Take a fresh look at your lifestyle.

కాంగ్రెస్ తోనే సొంతింటి కల సాకారం

బోథ్, ముద్ర:

కాంగ్రెస్ తోనే సొంతింటి కల సాకారం అవుతుందని బోథ్ సర్పంచ్ కుర్మే అన్నపూర్ణ, ఉప సర్పంచ్ విజయ రెడ్డి, ఆత్మ చైర్మన్ గోర్ల రాజు యాదవ్ లు అన్నారు. బోథ్ పట్టణంలోని సాయి నగర్‌ కు చెందిన కుమురం రేణుక ఇంటిని గురువారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలుతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
ఇంద్రమ్మ ఇళ్ల పథకాన్ని విజయవంతం చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ సోయం బాపురావు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఆడే గజేందర్, డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాధవ్ ల సహకారం ఎంతో కీలకమని అన్నారు. పేదల సొంతింటి కలను నిజం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తున్నాయని అన్నారు. ప్రజా పాలనలో భాగంగా ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు మరింత వేగంగా కొనసాగుతాయని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.