ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి :
56 వ ఎన్ ఎస్ యు ఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్ ఎస్ యు ఐ జిల్లా ఉపాధ్యక్షులు నోముల తరుణ్ ఆధ్వర్యంలో జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ లో పండ్లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా భువనగిరి మున్సిపల్ చైర్మన్ తంగళపెల్లి శ్రీవాణి రవికుమార్ విచ్చేసి మాట్లాడుతు విద్యారంగంలో పారదర్శకత, సమాన అవకాశాలు, నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో ఉండేలా చేయడం ఎన్‌ఎస్‌యూఐ ప్రధాన లక్ష్యంగా కొనసాగుతోందన్నారు. విద్యార్థుల ఫీజు సమస్యలు, స్కాలర్‌షిప్‌లు, ఉద్యోగ అవకాశాలు వంటి అంశాలపై ఉద్యమాలు చేపడుతూ విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యు ఐ నాయకులు నోముల కమల్, జానకి రామ్, రాకేష్, ఆకాష్, రామ్ చరణ్ పాల్గొన్నారు